మేడారంలో విషాదం.. సమ్మక్క పూజారి ముత్తయ్య మృతి 

Tragedy in Medaram.. Sammakka priest Muttiah diedనవతెలంగాణ – తాడ్వాయి 
ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క పూజారి మల్లెల ముత్తయ్య (50) అనారోగ్యంతో బాధపడుతూ శనివారం ఉదయం మృతి చెందారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ముత్తయ్య రాత్రి తీవ్ర అస్వస్థకు కావడంతో ఆసుపత్రికి తరలించేందుకు ఏర్పాటు చేస్తున్న సమయంలో ఇంట్లోనే మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. పూజారి ముత్తయ్యకు ఒక కూతురు, ఒక కొడుకు ఉన్నారు. పూజారి ముత్తయ్య మృతితో మేడారంలో విషాదఛాయలు అమ్ముకున్నాయి. ఆయన మృతి పట్ల పలువురు సంతాపాన్ని తెలియజేశారు.