ఎంపీ అభ్యర్థి గెలవాలని పోచమ్మ ఆలయంలో పూజలు..

నవతెలంగాణ – నాగిరెడ్డిపేట్

కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న ఎంపీ అభ్యర్థి సురేష్ షెత్కర్ భారీ మెజార్టీతో విజయం సాధించాలని గురువారం రోజు మండల కాంగ్రెస్ నాయకులు నల్ల పోచమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జరగనున్న పార్లమెంటు ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని వారు ధీమా వ్యక్తం చేశారు.  కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు శ్రీధర్ గౌడ్, ఉపాధ్యక్షుడు లక్ష్మణ్, మాజీ సర్పంచ్ బోయిని విట్టల్, కో ఆప్షన్ సభ్యుడు షాహిద్ పా, హనుమాన్లు, ఇమామ్, గులాం హుసేన్, గోపాల్పేట్ గ్రామ అధ్యక్షుడు శేఖర్ తదితరులు పాల్గొన్నారు.