ఎందరో దేశభక్తులు, విప్లవ వీరులు త్యాగ ఫలంగా లభించిన ప్రజాస్వామ్యానికి మతోన్మాదులు,పెట్టుబడిదారులు ముసుగులో ఉన్న నేటి పాలకులు తో ప్రమాదం పొంచి ఉందని సీపీఐ(ఎం) జిల్లా నాయకులు కొక్కెరపాటి పుల్లయ్య ఆవేదన వ్యక్తం చేసారు. పార్టీ పిలుపు మేరకు నిర్వహిస్తున్న తెలంగాణ సాయుధ రైతాంగ వార్షికోత్సవ సభల్లో భాగంగా సోమవారం పార్టీ మండల కమిటీ ఆద్వర్యంలో నందిపాడు లో ఏర్పాటు సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
మండల కార్యదర్శి చిరంజీవి అద్యక్షతన జరిగిన ఈ సభలో పుల్లయ్య మాట్లాడుతూ స్వాతంత్ర సమరం తో గానీ,రాజ్యాంగం ప్రాధమిక సూత్రాలు కూడా తెలియని, ఆర్ఎస్ఎస్ భావజాలంతో పాలన చేస్తున్న నేటి పాలకులు ప్రజానీకం పట్ల అత్యంత నిరంకుశంగా వ్యవహరించడం బాధాకరం అన్నారు.పురోగామి శక్తులు ఐక్యం కాకపోతే తిరోగామీ దిశగా సమాజాన్ని తీసుకెళ్తారని అన్నారు.