
సాగులో ఉన్న ప్రతీ ఎకరానికి, కౌలు, పోడు రైతులకు షరతులు లేని విధంగా రైతు బరోసా వర్తింప చేయాలని తెలంగాణ పామాయిల్ రైతు సంఘం రాష్ట్ర కన్వీనర్ కొక్కెరపాటి పుల్లయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. రైతు బరోసా విధివిధానాలు పై రైతుల నుండి సూచనలు,సలహాలు తీసుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం ఆదేశానుసారం ప్రాధమిక వ్యవసాయ పరపతి సంఘాలు,వ్యవసాయ శాఖ ఆద్వర్యంలో గురువారం,స్థానిక రైతు వేదికలో, అశ్వారావుపేట పీఏసీఎస్ అద్యక్షులు చిన్నంశెట్టి సత్యనారాయణ అద్యక్షతన నిర్వహించిన మహాజన సమావేశంలో పుల్లయ్య రాసిన ప్రసంగ పాఠాన్ని ఏవో నవీన్ చదివి వినిపించారు. దాని సారాంశం యధాతధంగా. రైతు భరోసా పై ప్రభుత్వానికి ఏదైనా నిర్దిష్ట అబిప్రాయం ఉన్నదా.ఇన్ని ఎకరాలకు అనే ప్రతి పాదన ఏదైనా ఉంటే ఈ సభలో ప్రకటించాలి. ఎన్ని ఎకరాలకు రైతు బరోసా కల్పించవచ్చు అనేది రైతులే చెప్పాలి అనడం సరైనది కాదనేది నా అభిప్రాయం. గతంలో ఇచ్చిన రైతు బంధు విధానంలో తప్పులు ఏమైన ఉంటే వాటిని సరిచేసి ఆ లోపాలు జరగకుండా చూడాలి. సాగు లతో ఉన్న ప్రతి ఎకరానికి రైతు భరోసా ఇవ్వాలి. రియల్ ఎస్టేట్ భూములు, కొండలు, గుట్టలు, సాగులో లేని భూములకు రైతు బరోసా వర్తింప చేయడం సరైనది కాదు.ఎన్నికల వాగ్ధానాలు ప్రకారం కౌలు రైతులకు కూడా రైతు బరోసా వర్తింప చేయాలి. సాగులో ఉన్న పోడు భూములకు మే రైతు భరోసా అందజేయాలి. అశ్వారావుపేటలో చాలామందికి ధరణి పాసు బుక్ లు రాలేదు.గతంలో ఆన్లైన్,సాగు ఆధారంగా రైతు బంధు ఇచ్చారు.అదే విధంగా సాగులో ఉన్న రైతులకు రైతు బరోసా ఇవ్వాలి. పత్రికలలో, సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నట్లు గా రేషన్ కార్డ్, ఐటీ రిటర్న్స్, ఇతర షరతులు లేని విధంగా సాగు లో ఉన్న రైతులకు,కౌలు రైతులకు రైతు బరోసా వర్తింప చేయాలి. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ ఉప సంచాలకులు అఫ్జల్ బేగం,ఏవో నవీన్,డిసిసిబి మోనట్రింగ్ ఆఫీసర్ సోమయ్య,మాజీ పీఏసీఎస్ అద్యక్షులు మొగుళ్ళపు చెన్నకేశవ రావు, డైరెక్టర్ లు పార్ధసారధి, కన్నయ్య, ప్రసాద్, బు జ్జి, ఎం.పి.పి జల్లిపల్లి శ్రీరామ మూర్తి, కో – ఆప్షన్ సభ్యులు ఎస్.కే పాషా, రైతులు తుమ్మ రాంబాబు, మురళి, పద్మ శేఖర్, యూ.ఎస్ ప్రకాశ్ రావు తదితరులు పాల్గొన్నారు.