జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ గా పుల్లూరు సప్న బాధ్యతలు మంగళవారం నూతన మార్కెట్ కార్యాలయంలో జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి డి.ప్రకాష్, మార్కెట్ సెక్రటరీ ఆర్ మల్లేశం సమక్షంలో బాధ్యతలు చేపట్టారు. 13 మంది మార్కెట్ డైరెక్టర్లు ఆమెతోపాటు పదవి స్వీకరణ చేశారు . మార్కెట్ వైస్ చైర్మన్ ఎర్రంరెడ్డి సతీష్ రెడ్డి,డైరెక్టర్లుగా కామిడి శ్రీపతి రెడ్డి,నల్లగోని సతీష్,మాదాసి సునీల్,నాయినేని రాజేశ్వరరావు,తాళ్లపల్లి శ్రీనివాస్,ఎగ్గేటి సదానందం,మనుపటి సురేష్,గడ్డం దీక్షిత్,ఉప్పల శ్రీనివాస్ రెడ్డి,ఎండి రషీద్ పాష,కందల తిరుపతి,దొడ్డ శ్యామ్ కుమార్,కటంగూరి శ్రీకాంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. నూతన మార్కెట్ కమిటీ పాలకవర్గానికి ఘనంగా సన్మానించారు .ఈ సందర్భంగా నూతన కమిటీకి కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి ప్రణవ్ ప్రణవ్ బాబు అభినందనలు తెలియజేశారు.రైతులకు, ప్రభుత్వానికి వారధిగా ఉంటూ,రైతు సమస్యలే ప్రధాన అజెండాగా ముందుకు వెళ్లాలని,మార్కెటింగ్ వ్యవస్థ పై మరింత నమ్మకం కలిగించేలా పాలకవర్గం పనిచేయాలని,మార్కెట్ కు వచ్చే రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు.