– పిహెచ్‌సి వైద్యాధికారి డాక్టర్ ప్రవీణ్ నాయక్
నవతెలంగాణ -నంగునూరు
పోలియో నివారణ కోసం మార్చి మూడు నుంచి చేపడుతున్న పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మలేరియా ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ ప్రవీణ్ నాయక్ అన్నారు. సోమవారం నంగునూరులో పల్స్ పోలియోపై ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ సమావేశంలో పాల్గొని మాట్లాడారు. మండలంలో ఐదు సంవత్సరాల లోపు 3256 మంది చిన్నారులను గుర్తించినట్లు తెలిపారు. అప్పుడే పుట్టిన బిడ్డను మొదలుకొని ఐదు సంవత్సరాల పిల్లలందరికీ పోలియో చుక్కలు అందించేందుకు నాలుగు రూట్లుగా విభజించి 31 పోలియో కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అన్ని నివాస ప్రాంతాల్లోని పిల్లలకు పోలియో చుక్కలు అందేలా 150 మంది సిబ్బంది, వాలంటీర్లను నియమించినట్టు తెలిపారు. మూడు రోజులపాటుపల్స్ పోలియో కార్యక్రమం ఉంటుందన్నారు. మొదటి రోజు పోలియో కేంద్రాల వద్దనే చిన్నారులు అందరికి చుక్కలు అందేలా చూడాలన్నారు. ఇద్దరు వైద్య అధికారులు, నలుగురు సూపర్వైజర్ల పర్యవేక్షణలో ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుందన్నారు. మాజీ ప్రజాప్రతినిధులు, క్షేత్రస్థాయి అధికారులు కార్యక్రమానికి సహకరించి విజయవంతం చేయాలని కోరారు. మండలంలోని రాజగోపాలపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య సిబ్బంది, అంగన్వాడీ టీచర్స్, ఆశ వర్కర్లకు పల్స్ పోలియోపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో వేణుగోపాల్, ఎంఈఓ దేశి రెడ్డి, తహసిల్దార్, వైద్యాధికారులు డాక్టర్ అంజలి రెడ్డి, ఎంఎల్ హెచ్ పి శివకేశవరెడ్డి, సూపర్‌వైజర్ స్వామి పాల్గొన్నారు.