నవతెలంగాణ – డిచ్ పల్లి
మార్చి మూడవ తేదీ ఆదివారం రోజున పల్స్ పోలియో కార్యక్రమం లో ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఇందల్ వాయి ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు సంతోష్ కుమార్ అన్నారు. గురువారం ఇందల్ వాయి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి లో ఆశా కార్యకర్తలు, ఆరోగ్య కార్యకర్తలకు పల్స్ పోలియోపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యదికారి సంతోష్ కుమార్ మాట్లాడుతూ మార్చి మూడవ తేదీ ఆదివారం రోజున పల్స్ పోలియో కార్యక్రమం ఉన్నందున ప్రజలందరూ ఈ కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఆశా కార్యకర్తలు, ఆరోగ్య కార్యకర్తలకు పల్స్ పోలియోపై అవగాహన కల్గి ఉండాలని సూచించారు.ఇందల్ వాయి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో 0 -5 సంవత్సరముల వయస్సు గల పిల్లలు 7322 మంది ఉన్నారని వారందరినీ ఖచ్చితంగా నూటికి నూరు శాతం లక్ష్యాన్ని చేర్చుకోవాలని తెలిపారు. మార్చి4, 5 న ఇంటింటికి తిరిగి తప్పిపోయిన పిల్లలకు పోలియో చుక్కలు వేయాలని ఆదేశించారు. ప్రతి ఒక్క ఐదు సంవత్సరాలలోపు పిల్లలందరికీ కచ్చితంగా పోలియో చుక్కలు వేయాలని ఎవరు తప్పిపోవడానికి వీలులేదని, హైరిస్క్ ఏరియా అయినటువంటి ఇటుక బట్టీలలో పనిచేసేవారు, లేదా భవన నిర్మాణ కార్మికులు, లేదా సంచార జాతరలో ఉన్నటువంటి చిన్న పిల్లలకు ఖచ్చితంగా పోలియో చుక్కలు వేయాలని సూచించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మొత్తం 61 బూతులను బూతులలో వేయడానికి పోలియో చుక్కలు వేయడానికి అరేంజ్ చేయడం జరిగిందన్నారు. ప్రతి ఆశా కార్యకర్త ఈ రెండు రోజులలో ఇంటింటికి తిరిగి ప్రజల్లో అవగాహన పెంచాలని ప్రతి గ్రామంలో మైకులను చాటింపు వేయించాలని, మసీదులు , చర్చిలు దేవాలయాల్లో మైకులలో చాటింపు వేయించాలని సూచించారు .ఈ కార్యక్రమంలో మండల ఆరోగ్య విస్తరణ అధికారి వై.శంకర్, ఆరోగ్య పర్యవేక్షకులు అక్బర్ అలీ, ఉమారాణి, ఆరోగ్య కార్యకర్తలు వెంకట్ రెడ్డి ,ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.