రేపు మల్లన్నసాగర్ పంపుహౌస్ ద్వారా ప్రాజెక్టులోకి నీటి పంపింగ్ ప్రారంభం

Pumping of water into the project through Mallannasagar pumphouse will start tomorrowనవతెలంగాణ – తొగుట
రైతన్నలకు వానాకాలం పంటలకు అవసరమైన సాగునీటిని పంపిణీ చేసేందుకు ప్రభుత్వం నీటిని విడుదల ప్రారంభిస్తుందని మల్లన్నసాగర్ డిఈ చెన్నూ శ్రీనివాస్ తెలిపారు. బుధవారం ఒక పత్రిక ప్రకటన ద్వారా తెలిపిన సమాచారం ప్రకారం వర్షా కాలంలో రైతులు సాగు చేసిన పంటలకు నీరు అందించేందుకు ప్రభుత్వం మల్లన్నసాగర్ రిజర్వా యర్ లోకి నీటి పంపింగ్ ప్రారంభించడానికి ఆదే శాలు జారీ చేసిందని అన్నారు. 2024-25 సంవ త్సరానికి పంపింగ్ సీజన్ లో మొదటి విడత లో బాగంగా గురువారం రోజున మల్లన్నసాగర్ పంపు హౌస్ ద్వారా రిజర్వాయర్ లోకి నీటి విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ సారి పంపింగ్ లో ప్రస్తుతం ఆమోదించబడిన షెడ్యూల్ ప్రకారం 8 తేదీ నుండి 11 వరకు 4 రోజుల పాటు 4 పంపుల ను నడుపడానికి హనుమతులు వచ్చాయని తెలిపారు. 4 పంపుల ద్వారా మొత్తం 5 వేల  క్యూసెక్కుల నీటిని పంపింగ్ చేస్తామని, రిజర్వా యర్‌లోకి రోజుకు 0.432 టిఎంసిల (శతకోటి ఘనపుటడుగులు) చొప్పున నీటిని లిఫ్టింగ్ చేస్తామని అన్నారు.