కొనుగోలు కేంద్రాలు రైతులకు అనుకూలంగా ఏర్పాట్లు చేయాలి

Purchase centers should be arranged in favor of farmers– అంగన్వాడీ కేంద్రాల పిల్లలపై సామ్, మామ్ పిల్లలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి
– కొనుగోలు కేంద్రాలలో రైతులకు నిబంధన ప్రకారం ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలి
– మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ 
నవతెలంగాణ – నెల్లికుదురు
రానున్న రోజుల్లో వర్షాలు పడే సూచన ఉన్నందున కొనుగోలు కేంద్రాల నిర్వహకులు అందుకు రైతులకు అనుకూలంగా అన్ని రకాల ఏర్పాట్లను చేయాలని మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ అన్నాడు. మంగళవారం మండలంలోని ఎర్రబెల్లిగూడెం, మునిగలవీడు, నెల్లికుదురు, గ్రామాలలో ప్రాథమిక వ్యవసాయ సహకార సొసైటీ, ఐకెపి ఆధ్వర్యంలో నిర్వహించబడుచున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలు, అంగన్వాడి కేంద్రాలను తనిఖీలు ఆకస్మికంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ మాట్లాడుతూ జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం రైతులకు ఎలాంటి  ఇబ్బందులూ లేకుండా చర్యలు తీసుకోవాలని నిర్వాహకులకు సూచించినట్లు తెలిపారు, వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు రైతులకు కావాల్సినన్ని టార్పాలిన్లు తగిన ఏర్పాట్లను చేయాలని తెలిపాడు, కొనుగోలు చేసిన దాన్యాన్ని వెంట వెంటనే తరలించాలని అన్నాడు,  కొనుగోలు చేసిన దాన్యం వివరాలు రైతు వివరాలను ఓపిఎంఎస్ లో వెంటనే ఎంట్రీ చేయాలన్నారు. ఇప్పటివరకు ఎంత ధాన్యం వచ్చింది, ఎంత తరలించడం జరిగింది, ఇంకా ఎంత హార్వెస్టింగ్ అయ్యింది, అనే వివరాల అడుగుతూ రిజిస్టర్లను తనిఖీ చేశారు.రానున్న రోజుల్లో వర్షాలు పడే సూచనలు ఉన్నందున కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు అందుకు అనుగుణంగా ఏర్పాట్లను చేయాలన్నారు.ఎర్రబెల్లి గూడెం లోని అంగన్వాడి కేంద్రాన్ని తనిఖీ చేసి పిల్లలకు అందిస్తున్న డైట్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. పౌష్టిక విలువలు  కలిగిన నాణ్యమైన ఆహారం అందించాలని, తమ పరిధిలో సామ్, మామ్ పిల్లల పై ప్రత్యేక దృష్టి పెట్టాలని, అంగన్వాడి కేంద్రంలోని పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆ సెంటర్ నిర్వాహకులకు సూచించారు.ఈ కార్యక్రమంలో  తహసిల్దార్ రాజు, ఇన్చార్జి ఎంపీడీవో పద్మ పిఎసిఎస్ ఎర్రబెల్లి గూడెం చైర్మన్ పోనుగోటి దేవేందర్ రావు ,వ్యవసాయ శాఖ అధికారిని యాస్మిని బేగం, సీఈవో సుభాష్ ఏఈఓ చందన తదితరులు ఉన్నారు.