కొనుగోలు కేంద్రాలు వెంటనే ఏర్పాటు చేయాలి 

– గణపాక సుధాకర్ కాంగ్రెస్  జిల్లా కార్యదర్శి
నవతెలంగా- గోవిందరావుపేట: ధాన్యం కొనుగోలు కేంద్రాలు వెంటనే ఏర్పాటు చేయాలని జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి గనపాక సుధాకర్ అన్నారు.బుధవారం  గోవిందరావుపేట మండలం, సోమలగడ్డ గ్రామంలో రైతు సమస్యలపై కాంగ్రెస్  జిల్లా కార్యదర్శి గనపాక సుధాకర్ రైతులతో మాట్లాడారు. కాంగ్రెస్ నాయకులతో కలసి 20 రోజులుగా వరి కోతలు కోసి వడ్ల రాసులతో కంట కోసం ఎదురు చూస్తున్నారు. వ్యవసాయ శాఖ అధికారులు కానీ, ఐకేపీ వారు కానీ వడ్ల కంట మొదలుపెట్టలేదు. రెండు, మూడు రోజులుగా వాతావరణంలో మార్పు రావడం చుస్తే రైతుల గుండెల్లో గుబేల్లుమంటు ఉంది. అకాల వర్షాలకు తడిసి వడ్లు,  పంటలు నష్టపోతామణి అయోమయంలో ఉన్నారు. ప్రభుత్వం గత తొమ్మిది సంవత్సరాలకుపైగా అధికారంలో ఉంటూ రైతులు పండంచినటువంటి పంటను సకాలంలో సరిఅయిన గిట్టుబాటు ధరకు కొనలేని హీన స్థితిలో ఉండి రైతులను అనేక ఇబ్బందులకు గురించేస్తుంది. బీఆర్ఎస్ ప్రభుత్వం రైస్ మిలర్లతో కుమ్మకై కమిషండ్లకు అలవాటు పడి అవినీతిగా, అక్రమంగా సంపాదిస్తూ, రైతులు పండించిన పంటనుండి క్వింటకు 10 కెజిల నుండి 12కెజిలవరకు వడ్లను వివిధ కారణాలు చెప్పి కట్ చేస్తుంటే కేసీఆర్ ప్రభుత్వం రైస్ మిల్లార్లకు వత్తాసు పలుకుతుంది తప్పు, రైతులకు న్యాయం చేసిన పాపాన పోలేదు. రైతులకు ఉచిత ఎరువులు అందిస్తామని ప్రగల్బాలు పలికిన కేసీఆర్ ప్రభుత్వం ఉచితమేమోకాని డీ ఏ పి యూరియా  బస్టాలకు వందలు, వేల రూపాయలు పెంచినాడు.అకాల వర్షాలకు తడిచిన ధాన్యం అమ్ముకోలేక రైతులు ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాలు అనేకం ఉన్నానాయి. సకాలంలో రైతుల యొక్క వరి ధాన్యం కొనక పోవడంతో రైతులు రాత్రి వేళలో వడ్ల కాపాలకు వెళ్లి ఆడమరచి నిద్ర పొతే వారి పైనుండి చీకట్లో ట్రాక్టర్ వెళ్లి చనిపోయిన చలించని కేసీఆర్ ను ఫామ్ హౌస్ కి పంపించాలని అన్నారు. నష్ట పోయిన రైతులకు, చనిపోయిన రైతులకు, ఎక్సగ్రీసియే కుడా ఇవ్వని ముఖ్యమంత్రిని  ఇంటికి పంపాలని కోరారు. తెలంగాణ రాష్ట్రము వస్తే రైతు ఆత్మ హత్యలు ఉండవని ప్రగల్బాలు పలికి రైతులను మోసం చేసిన కల్వకుంట్ల చంద్రశేఖర రావును  గద్దెదించాలని రైతు కుటుంబాలను వేడుకున్నారు. దాదాపు తొమ్మిది సంవత్సరాలకాలంలో 8000ల కు పైగా రైతులు తెలంగాణలో ఆత్మ హత్యలు చేసుకున్నారు నిరాక్షస పాలనలో మోసపూరిత మాటలతో పాలన చేసుకుంటూ అనేక వర్గాల ప్రజలను మోసం చేస్తూ వస్తున్నాడు అటువంటి ప్రభుత్వాన్ని 100మీటర్ల లోతులో బొంద తవ్వి అందులో పతర వెయ్యాలి అన్నారు. అన్నం పెట్టే రైతును ఆడుకోలేని ప్రభుత్వం మనకు అవసరం లేదు అన్నారు. అందుకే రైతు సోదర్లను వేడుకుంటాన్నాను కాంగ్రెస్ పార్టీ కి ఓటు వేసి గెలిపించండి. ఇందిరమ్మ రాజ్యంలో రైతు రాజ్యం వస్తుంది. అందులో  ” రైతే రాజు “అవ్వుతాడు అని అన్నారు. సీతక్కను అధికామెజార్టీతో గెలిపించాలనికోరారు. ఈకార్యక్రమంలో గ్రామ కమిటీ ఉపాధ్యక్షులు కందాల వెంకన్న, ప్రధాన కార్యదర్శి పాతూరి జగన్ మోహన్ రావు, కార్యదర్శి గొల్లపూడి సంబశివారావు, పోలేబోయిన రమేష్, రాజమ్మ, సంధ్య, ప్రమీల, రమక్క. తదితరులు పాల్గొన్నారు.