– తూకంలోని మోసాలను అరికట్టాలి
– పత్తికి రూ.12,500, వారికి రూ. 28 50 ఇవ్వాలి
– కాంటావేసిన వెంటనే రైతు ఖాతాలో డబ్బులు జమ చేయాలి
– రైతు సంఘం రాష్ట్ర నాయకుల డిమాండ్
నవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్
పత్తి, వరి పంటలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలువెంటనే కొనుగోలు కేంద్రాలుఏర్పాటు చేయాలని రైతు సంఘం రాష్ట్ర నాయకులుముదిరెడ్డి సుధాకర్ రెడ్డి, బండ శ్రీశైలం డిమాండ్ చేశారు. కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని కోరుతూ బుధవారం జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి కి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, జిల్లావ్యాప్తంగా ప్రత్తి మార్కెట్లకు తీసుకు వస్తున్నారని, ప్రభుత్వం మాత్రం సీ,సీ,ఐ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడం వలన గ్రామాల్లో ఉన్న మధ్య దళారీలు, బ్రోకర్స్ వచ్చి పత్తి కింటాలుకు రూ.5000 రూపాయలు నుండి రూ.6000 రూపాయల వరకు ధరను తగ్గిస్తూ, తూకంలో అదనంగా తూకం వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ పెట్టుబడులు పెరిగినందువలన విత్తనాలు, ఎరువు పురుగుమందులు రేట్లు పెరిగాయని, పత్తి క్వింటాలుకు రూ.12500 రూపాయలు,వరి ధాన్యముకు క్వింటాలుకు2850 రూపాయలుఇవ్వాలని, అదనంగా రూ.1000 రూపాయలుబోనస్ ప్రకటించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలనిడిమాండ్ చేశారు. కొనుగోలు కేంద్రాలలోమౌలిక వసతులు కల్పించాలని, ట్రాన్స్ పోర్ట్, గోనెసంచులు కొరత లేకుండాని వారించాలని అన్నారు. వరి, పత్తి కాంటావేసిన వెంటనేరైతుల ఖాతాలో డబ్బు జమ చేయాలని వారు కోరారు. కొనుగోలు కేంద్రాల పై జిల్లా అధికారులు వెంటనే తనిఖీలు చేసి రైతులను ఆదుకోవాలనివారు కోరారు. ఈ కార్యక్రమంలోరైతు సంఘం జిల్లా అధ్యక్షులు వి. వెంకటేశ్వర్లు, రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కె. నాగిరెడ్డి, రైతు సంఘం జిల్లా నాయకులు అయిత రాజు నరసింహ, సాగర్ల మల్లేష్, చాపల మారయ్య, కుంభం కృష్ణారెడ్డి, వి. నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.