కందకుర్తి గ్రామంలో పొగాకు కొనుగోలు ప్రారంభం

నవతెలంగాణ – రెంజల్

రెంజల్ మండలం కందకుర్తి గ్రామంలో కె.ఆర్ & కంపెనీ ఆధ్వర్యంలో పొగాకు కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఎంపీటీసీ అసాద్ బేగ్, గంగా సింగ్ లు కమిషన్ పై కె ఆర్ కంపెనీకి పోగాకును సరఫరా చేస్తున్నారు. ఏ గ్రేడ్, బి గ్రేడ్, సీ గ్రేడ్ల ను కంపెనీ యాజమాన్యం పరిశీలించి కొనుగోలు చేస్తున్నారు. గ్రేడ్లను బట్టి ఇతర కంపెనీలు ఏ ధరను నిర్ణయిస్తారోఅదే ధరతో రైతులకు అందజేయడం జరుగుతుందని వారు పేర్కొన్నారు.