నవతెలంగాణ – మద్నూర్
పత్తి రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా కొనుగోలు చేపట్టాలని కామారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ విక్టర్, బాన్సువాడ ఆర్డిఓ కిరణ్ మయి సీసీఐ అధికారులకు, మార్కెటింగ్ శాఖ అధికారులకు వ్యవసాయ శాఖ అధికారులకు సూచించారు. అనంతరం అధికారులు కొనుగోలు కేంద్రాన్ని పారంభించారు. పత్తి పంటకు మద్దతు ధర క్వింటాల్కు రూ.7521 చొప్పున కొనుగోలు చేయాలని తెలిపారు. కొనుగోలు కేంద్రాన్ని జిల్లా అదనపు కలెక్టర్, బాన్స్వాడ ఆర్డిఓ కిరణ్ మాయి, మార్కెటింగ్ శాఖ జిల్లా అధికారి రమ్య కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆదిలాబాద్ బ్రాంచ్ అసిస్టెంట్ మేనేజర్ పూజ, మద్నూర్ మార్కెట్ మార్కెట్ పరిధిలో కొనుగోలు చేసే కాటన్ పర్చేస్ అధికారి ఓబుల్ రెడ్డి, మద్నూర్ మార్కెట్ కమిటీ కార్యదర్శి రామ్నాథ్, మండల తహసిల్దార్ ఎండి ముజీబ్, మండల వ్యవసాయ అధికారి రాజు, మద్నూర్ మార్కెట్ పరిధిలోని ప్రైవేట్ పత్తి కొనుగోలు వ్యాపారులు, కమిషన్ ఏజెంట్లు, ఈ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం పత్తి పంట తేమ 8 శాతం నుండి 12 శాతం వరకు ఉండాలని అధికారులు సూచించారు. ఎకరానికి 10 క్వింటాళ్ల చొప్పున మద్దతు ధర కేంద్రంలో రైతులు అమ్ముకోవచ్చని మండల వ్యవసాయ అధికారి రాజు తెలిపారు. సీసీఐ ఆధ్వర్యంలో మద్దతు ధర కొనుగోళ్ల అమ్మకానికి తీసుకువచ్చిన పత్తి రైతు పంట తేమశాతం అనుకూలంగా ఉండడంతో ఆ రైతుకు జిల్లా అదనపు కలెక్టర్ ఆర్డిఓ మార్కెట్ కమిటీ అధికారులు ప్రత్యేకంగా సన్మానించారు. పత్తి కొనుగోళ్ళను మార్కెట్ కమిటీ పరిధిలోని ప్రైవేట్ గోవిందు ఇండస్ట్రీలో చేపట్టారు. పత్తి పంట రైతులు అమ్మటానికి తీసుకువచ్చిన వారికి నిబంధనల ప్రకారం అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అధికారులు తెలిపారు. ప్రారంభోత్సవం అనంతరం అదనపు కలెక్టర్ ఆర్ డి ఓ మార్కెటింగ్ శాఖ జిల్లా అధికారి, సీసీఐ అధికారులు రాష్ట్ర సరిహద్దును సందర్శించి కొనుగోలు పత్తి మిల్లును సందర్శించి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మార్కెటింగ్ శాఖ సూపర్వైజర్లు రాంచందర్, సత్యం, మార్కెట్ సిబ్బంది, సిసిఐ సిబ్బంది రైతులు పాల్గొన్నారు.