పక్కా యాక్షన్‌ సినిమా

Nandamuri Kalyan Ramనందమూరి కళ్యాణ్‌ రామ్‌ పుట్టినరోజు సందర్భంగా ఆయన నటిస్తున్న 21వ చిత్రానికి సంబంధించి బ్రాండ్‌ న్యూ పోస్టర్‌ను లాంచ్‌ చేసి, ఆయనకు మేకర్స్‌ స్పెషల్‌ ట్రీట్‌ అందించారు. ఈ పోస్టర్‌లో కళ్యాణ్‌ రామ్‌ ఫెరోషియస్‌ అవతార్‌లో కనిపించారు. స్టైలిష్‌ మేకోవర్‌తో ఆయన వైలెంట్‌గా కనిపిస్తున్నారు. ప్రదీప్‌ చిలుకూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కళ్యాణ్‌ రామ్‌ కొన్ని డేర్‌ డెవిల్‌ స్టంట్స్‌ చేయనున్నారు. వీటిల్లో ఫైర్‌ యాక్షన్‌ ఎపిసోడ్‌ ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. ముప్పా వెంకయ్య చౌదరి సమర్పణలో అశోక్‌ క్రియేషన్స్‌, ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ బ్యానర్స్‌ పై అశోక్‌ వర్ధన్‌ ముప్పా, సునీల్‌ బలుసు ఈ సినిమాని నిర్మిస్తున్నారు.విజయశాంతి ఐపీఎస్‌ ఆఫీసర్‌గా డైనమిక్‌ క్యారెక్టర్‌ని పోషిస్తోన్నారు. ఈ చిత్రంలో సోహైల్‌ ఖాన్‌, సాయి మంజ్రేకర్‌, శ్రీకాంత్‌ ప్రముఖ పాత్రల్లో కనిపించనున్నారు. ప్రస్తుతం సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది.
ప్రీ ప్రొడక్షన్‌లో బింబిసార 2
వశిష్ట దర్శకత్వంలో రూపొందిన ‘బింబిసార’ అఖండ విజయాన్ని సాధించింది. దీనికి సీక్వెల్‌గా ‘రొమాంటిక్‌’ సినిమాను తెరకెక్కించిన అనిల్‌ పాదూరి ‘బింబిసార2’కి దర్శకత్వం వహించనున్నారు. ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ దీన్ని నిర్మించనుంది. ప్రీ ప్రొడక్షన్‌ పనులు శరవేగంగా జరుగుతున్న ఈ సినిమాని అతి త్వరలోనే ప్రారంభించబోతున్నారు.