పక్కా మాస్‌ బీట్‌ సాంగ్‌

Pure mass beat songడైస్‌ ఆర్ట్‌ ఫిల్మ్స్‌ ఆధ్వర్యంలో గాయకుడు నోయెల్‌ పాడిన ‘తెలుగోడి బీట్‌ సాంగ్‌..’ లాంచ్‌ ఈవెంట్‌ విజయవంతంగా జరిగింది. పలువురు ప్రముఖులు, విద్యార్థులు పాల్గొని ఈ వేడుకను మరింత ప్రత్యేకం చేశారు. డైస్‌ ఆర్ట్‌ ఫిల్మ్స్‌ టీమ్‌ హర్షడైస్‌, మనస్వి రాజేష్‌ కన్నా మాట్లాడుతూ,’నోయెల్‌ సాంగ్‌ ఈవెంట్‌ భారీ విజయాన్ని సాధించింది. దీన్ని మర్చిపోలేని విధంగా చేసినందుకు నా విద్యార్థులకు, అతిథులకు ధన్యవాదాలు. నోయెల్‌ తన అద్భుతమైన ప్రదర్శనకు, మాతో చేరినందుకు మా అతిథులకు ప్రత్యేక ధన్యవాదాలు’ అని తెలిపారు. మ్యూజిక్‌ డైరెక్టర్‌ నోయల్‌ మాట్లాడుతూ,’సాంగ్‌ చాలా బాగా వచ్చింది. ఇంత బాగా రావడానికి కారణం అయినా ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. ఈ పాటకు పని చేసిన డిఓపి భార్గవ్‌ అత్యద్భుతమైన విజువల్స్‌ అందించారు. పాటలో స్టన్నింగ్‌ విజువల్స్‌ ఉన్నాయి. అలాగే కొరియోగ్రాఫర్‌ సుభాష్‌ మాస్టర్‌ డాన్స్‌ చాలా బాగా కంపోజ్‌ చేశారు. ఈవెంట్‌కు రాహుల్‌ సీట్లు గంజ్‌ రావడం ఎంతో ప్రత్యేకం. ఈ పాట అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. ఈనెల 31, సంక్రాంతి పండుగలకు దుమ్ము రేపుతుందనే నమ్మకం ఉంది’ అని తెలిపారు. ”తెలుగోడి బీట్‌ పాట’లో ఫుల్‌ మాస్‌ బీట్‌ ఉంది. ప్రేక్షకులు కచ్చితంగా ఈ పాటని ఘనవిజయం చేస్తారు. ఈ పాట చేసిన నోయల్‌కు అభినందనలు. ఈ పాట ప్రతి ఒక్కరిని షేర్‌ చేయాలని, ఇలాంటి పాటలు మరెన్నో చేయాలని రాహుల్‌ సిప్లిగంజ్‌ పేర్కొన్నారు. అన్ని వేడుకల్లో దుమ్మురేపుతుంది’ అని రాహుల్‌ సిప్లిగంజ్‌ అన్నారు.