పక్కా కమర్షియల్‌ సినిమా

పక్కా కమర్షియల్‌ సినిమామహేష్‌ బాబు, త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ కాంబోలో ‘అతడు’, ‘ఖలేజా’ వంటి కల్ట్‌ క్లాసిక్స్‌ తర్వాత వస్తున్న చిత్రం ‘గుంటూరు కారం’. హారిక హాసిని క్రియేషన్స్‌ పతాకంపై అన్ని రకాల కమర్షియల్‌ వ్యాల్యూస్‌తో ఈ చిత్రాన్ని నిర్మాత ఎస్‌. రాధాకష్ణ (చిన్నబాబు) నిర్మిస్తున్నారు. లేటెస్ట్‌గా చిత్రబందం థియేట్రికల్‌ ట్రైలర్‌ను విడుదల చేసింది. ఇందులో మహేష్‌ బాబు డైలాగ్స్‌, ఆయన యాటిట్యూడ్‌, ఆయన ఎనర్జీ అన్నీ కూడా ఇటీవలి కాలంలో ఆయన చేసిన చిత్రాలకు భిన్నంగా సరికొత్తగా ఉన్నాయి.సంక్రాంతికి విడుదల కానున్నందున, థియేటర్లలో పండుగ సినిమా కోసం ప్రేక్షకులు ఎదురుచూసే అన్ని అంశాలను మేకర్స్‌ జోడించినట్లు తెలుస్తోంది. ఈ ట్రైలర్‌ ఖచ్చితంగా సినిమా బ్లాక్‌ బస్టర్‌ ఎంటర్‌టైనర్‌గా నిలుస్తుందనే నమ్మకాన్ని కలిగిస్తోంది. శ్రీలీల మీనాక్షి చౌదరి నాయికలుగా నటించి ఈ చిత్రానికి తమన్‌ సంగీతం అందించారు. సంక్రాంతి బరిలోకి దిగుతూ ఈనెల 12న ఈ సినిమా విడుదల కానుంది.