తెలంగాణ మాల మహా నాడు జిల్లా అధ్యక్షురాలుగా పుర్రి స్వరూప 

నవతెలంగాణ -తాడ్వాయి :
 తెలంగాణ మాల మహా నాడు ములుగు జిల్లా మహిళా అధ్యక్షురాలుగా తాడ్వాయి మండలం కాల్వపల్లి గ్రామానికి చెందిన పుర్రి స్వరూపను నియమించినట్లు తెలంగాణ మాల మహా నాడు జిల్లా అధ్యక్షులు కర్రీ శ్యాంబాబు తెలిపారు. అనంతరం స్వరూప మాట్లాడుతు నామీద ఉన్న నమ్మకంతో తెలంగాణ మాల మహా నాడు ములుగు జిల్లా మహిళా అధ్యక్షురాలుగా నియమించడం సంతోషంగా ఉందని, మాల మహా నాడు సంఘం బలోపేతం కోసం సంఘం అభివృద్ధికి నా శాయశక్తుల కృషి చేస్తానని అన్నారు. తన నియామకంకు సహకరించిన జాతీయ వ్యవస్థపాక అధ్యక్షులు అద్దంకి దయాకర్, రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్, జిల్లా నాయకులు మండల నాయకులకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు.