– కొందరి పోలీసులకు బదిలీల గుబులు…
నవతెలంగాణ-అచ్చంపేట
భారత రాష్ట్ర సమితి 10 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు స్థానిక పోలీసులు ప్రత్యక్ష పార్టీ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ వంశీకృష్ణ ను వివిధ కార్యక్రమాలు చేస్తుండగా స్థానిక పోలీసులు అడ్డుకొని ఇబ్బందులకు గురి చేశారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చిన కార్యక్రమాలు సైతం అచ్చంపేటలో చేయకుండా ఆడ్డుకునే ప్రయత్నాలు జరిగాయి. కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలపైన కేసులు నమోదు చేసి ఇబ్బందులకు గురి చేశారని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే గువ్వల బాలరాజుకు అనుకూలంగా ఎస్సై, సిఐలు, కొందరు కానిస్టేబుళ్లు వ్యవహరిస్తున్నారని గతంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు బహిర్గతంగా ఆరోపించారు.
ఇదిలా ఉండగా ప్రస్తుతం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ వంశీకృష్ణ
అధిక మెజార్టీతో గెలుపొందారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయింది. ఈ క్రమంలో గతంలో ఏ మండలంలో ఎస్ఐ , సిఐలు కొందరు కానిస్టేబుళ్లు ఇబ్బందులకు గురి చేశారో గుర్తు చేసుకుంటున్నారని తెలుస్తుంది. ప్రణాళిక రూపొందించుకొని వారిని ఇక్కడి నుంచి బదిలీ చేసే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీలో జరుగుతుందని చర్చించుకుంటున్నారు. అయితే అప్పుడు ఇబ్బందులకు గురిచేసిన ఎస్సై లను , సీఐలను , కొందరు కానిస్టేబుల్ లను ఇక్కడనే ఉంచి వారితో అనుకూలంగా పని చేయించుకోవాలని కార్యకర్తలు , నాయకులు ఎమ్మెల్యే వంశీకృష్ణకు సూచిస్తున్నట్లు తెలుస్తుంది. ఎన్నికల సందర్భంగా ప్రచారంలో భాగంగా అచ్చంపేటలో తీన్మార్ మల్లన్న పర్యటించారు.
అంబేద్కర్ చౌరస్తాలో ఏర్పాటుచేసిన రోడ్ షో ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ… వంశి కృష్ణ అన్నా నీవు గెలిచిన తర్వాత ఇన్నాళ్లు మనలను, కార్యకర్తలను ఇబ్బందులకు గురిచేసిన ఒక్క పోలీసోడు ఇక్కడ ఉండొద్దు అంటూ సూచించాడు. అప్పుడు కార్యకర్తలు నాయకులు కేరింతలు పెట్టారు. అనుకున్నట్టుగానే వంశీకృష్ణ ఎమ్మెల్యేగా గెలుపొందారు. దీంతో కచ్చితంగా అచ్చంపేట పోలీస్ శాఖలో ప్రక్షాళన జరుగుతుందని చర్చ బలంగా జరుగుతుంది. పోలీసులకు బదిలీ గుబులు పుడుతుందనీ చర్చ జరుగుతుంది. మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజుకు అనుకూలంగా పనిచేసిన కొందరు పోలీసులు ముందుగానే ఎలాగైనా సరే ఇకనుంచి వెళ్లిపోవాలని ఆలోచనతో ఉన్నత అధికారులను సంప్రదిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది.