ఎర్రజెండా పోరాటాలకు పురిటిగడ్డ నక్కర్త మేడిపల్లి

– ఎర్రజెండా పోరాటాలకు పురిటిగడ్డ నక్కర్త మేడిపల్లి
– సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు జాన్‌వెస్లీ
– కామ్రేడ్‌ గడ్డం చెన్నయ్య సంతాప సభ
– నివాళులర్పించిన సీపీఐ(ఎం) శ్రేణులు
నవతెలంగాణ-యాచారం
ఎర్రజెండా పోరాటాల పురిటి గడ్డగా నక్కర్త మేడిపల్లి చరిత్రలో నిలిచిందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు జాన్‌ వెస్లీ అన్నారు. శనివారం యాచారం మండల పరిధిలోని మేడిపల్లిలో కామ్రేడ్‌ గడ్డం చెన్నయ్య సంతాప సభను సిపిఎం గ్రామ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. అనంతరం ఆయన చిత్రపటానికి సిపిఎం శ్రేణులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులకు సిపిఎం నాయకులు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అనంతరం ఆయన స్మారక స్థూపాన్ని సిపిఎం నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జాన్‌ వెస్లీ మాట్లాడుతూ కామ్రేడ్‌ గడ్డం చెన్నయ్య చిన్న వయసులో గుండెపోటుతో మతి చెందడం సిపిఎం పార్టీకి తీరని లోటని తెలిపారు. ఆయన కుటుంబానికి ఎల్లవేళలా ఎర్రజెండా అండగా ఉంటుందని చెప్పారు. గతంలో ఆయనపై బూర్జువ పార్టీల గుండాలు అత్యాయత్నం కూడా చేశారని గుర్తు చేశారు. మేడిపల్లిలో ఎంతోమంది మహనీయులు ఎర్రజెండా కింద పనిచేసి నిరంతరం పేద ప్రజల పక్షాన పనిచేశారని గుర్తు చేశారు. ఈ ప్రాంతంలో దొరలకు, భూస్వాములకు వ్యతిరేకంగా ఎర్రజెండా ప్రజా పోరాటాలు చేసిందని వివరించారు. గడ్డం చెన్నయ్య బతుకి ఉన్నతకాలం ఎర్రజెండా కింద పనిచేశారని అన్నారు. గతంలో వార్డు మెంబర్‌ గా గెలుపొంది ప్రజలకు సేవలు అందించారని తెలిపారు. ఎన్ని అడ్డంకులు వచ్చిన చెన్నయ్య మాత్రం ఎర్రజెండాను వదిలేలేదని చెప్పారు. బడుగు, బలహీన వర్గాల ప్రజల బతుకు బాగుకోసం ఎన్నో లాఠీలు, జై ళ్ల సంఘటనను కూడా ఎదుర్కొన్నారని గుర్తు చేశారు. కామ్రేడ్‌ గడ్డం చెన్నయ్య కుటుంబానికి సిపిఎం ఎల్లవేళలా అండగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఆయన మన మధ్యన లేకపోవడం సిపిఎం పార్టీకి తీరని లోటు అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి కాడిగళ్ల భాస్కర్‌, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బి మధుసూదన్‌, పగడాల యాదయ్య, బోడ సామెల్‌, సిపిఎం మండల కార్యదర్శి ఆలంపల్లి నరసింహ, మండల నాయకులు పి అంజయ్య, పి బ్రహ్మయ్య, ఆలంపల్లి జంగయ్య, చందు నాయక్‌, సర్పంచ్‌ దంతుక పెద్దయ్య, ఉప సర్పంచ్‌ కావాలి జగన్‌, మల్లేష్‌, వెంకటయ్య, లాజర్‌, పెంటయ్య, మహేందర్‌ తదితరులు పాల్గొన్నారు.