గోవిందరావుపేటలో స్వచ్ఛదనం – పచ్చదనం 

Purity - Greenness in Govinda Raopetనవతెలంగాణ – గోవిందరావుపేట
ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం సోమవారం మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యదర్శి శంకర్ ఆధ్వర్యంలో ముమ్మరంగా నిర్వహించారు. 163వ జాతీయ రహదారి వెంట స్వచ్ఛదనం పచ్చదనం వివరిస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు అనంతరం పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో శంకర్ మాట్లాడుతూ స్వచ్ఛతనం పచ్చదనం ప్రాముఖ్యతను ప్రభుత్వ లక్ష్యాన్ని ప్రజలకు వివరించారు. మొక్కలు నాటుతామని స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం సందర్భంగా కార్యక్రమానికి హాజరైన వారంతా ప్రతిజ్ఞ చేశారు. అనంతరం అధికారులు ప్రజాప్రతినిధులు ప్రజలతో కలిసి వీధులలో పిచ్చి మొక్కలను చెత్తను తీసివేసి స్వచ్ఛదనం పచ్చదనం భాగంగా అధికారులు ప్రజలు ప్రజాప్రతినిధులు అంతా మమేకమై శ్రమదానాన కార్యక్రమంలో పాల్గొన్నారు.