
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్వచ్ఛ ధనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా సోమవారం నాడు మద్నూర్ మండలంలోని పెద్ద ఎక్లారా, సోముర్, గ్రామాల్లో మండల తహసీల్దార్ ఎండి ముజీబ్ ఆధ్వర్యంలో ర్యాలీ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ ఎండి ముజీబ్ మాట్లాడుతూ.. గ్రామపంచాయతీ పరిధిలో స్వచ్ఛ దనం పచ్చదనం కార్యక్రమాలు విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మద్నూర్ సింగిల్ విండో చైర్మన్ శ్రీనివాస్ పటేల్ సోమూరు గ్రామ కార్యదర్శి భాస్కర్ పెద్ద ఎక్లారా గ్రామ కార్యదర్శి కృష్ణవేణి ఆయా గ్రామాల అంగన్వాడి టీచర్లు ఆశా వర్కర్లు గ్రామ పెద్దలు గ్రామస్తులు పాల్గొన్నారు.