రాజ రాజేశ్వరి నగర్ లో స్వచ్ఛత హి సేవ

Purity Hi Seva in Raja Rajeshwari Nagarనవతెలంగాణ – కమ్మర్ పల్లి

మండలంలోని రాజరాజేశ్వరి నగర్ లో స్వచ్ఛత హి సేవ పక్షోత్సవాలు నిర్వహించారు. సందర్భంగా పంచాయతీ కార్యదర్శి  ఏం. రాఘవేందర్ ఆధ్వర్యంలో గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం గ్రామంలోని ఆయా కాలనీలో ఇంటింటికి తిరుగుతూ పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఇంటి ఆవరణను శుభ్రంగా ఉంచుకోవడం ద్వారా వ్యాధుల బారిన పడకుండా మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవచ్చని సూచించారు. సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించారు.కార్యక్రమంలో కమ్మర్ పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం విస్తీర్ణ అధికారి, ఏఎన్ఎం సాన, అంగన్వాడి టీచర్ గంగమణి, ఆశా కార్యకర్త శారద, తిరుమల, వినీల, శాంత, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.