నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
కేంద్ర హౌంమంత్రి అమిత్ షా హిందీని ఎక్కువగా ప్రమోట్ చేయాలంటూ నొక్కి చెప్పడాన్ని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తప్పుపట్టారు. ఈ మేరకు గురువారం ఆయన ట్వీట్ చేశారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, బెంగాలీ, మరాఠీ, ఒరియా, గుజరాతీ తదితర భాషలను ఎక్కువ మంది మాట్లాడేలా ప్రమోట్ చేయొచ్చు కదా ? అని ప్రశ్నించారు. భారతదేశంలోని 22 అధికారిక భాషలలో హిందీ ఒకటని గుర్తుచేశారు. భిన్న భాషాల వైవిధ్యమే భారతదేశం యొక్క ప్రత్యేకత, బలమని తెలిపారు. అలాంటి భాషల విషయంలో హిందీని మాత్రమే అందరిపై రుద్దాలని అమిత్‌షా చేస్తున్న ప్రయత్నం దేశానికి మంచిది కాదని పేర్కొన్నారు.