‘పుష్ప 2’ అరుదైన రికార్డ్‌

'Pushpa 2' is a rare recordరూ.294 కోట్ల గ్రాస్‌ని కలెక్ట్‌ చేసి భారతీయ సినీ చరిత్రలోనే తొలిరోజు అత్యధిక కలెక్షన్లు కలెక్ట్‌ చేసిన ఘనతను ‘పుష్ప 2’ సాధించింది. సుకుమార్‌ దర్శకత్వంలో అల్లు అర్జున్‌ హీరోగా మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మించిన ఈ సినిమా భారతదేశ సినీ చరిత్రలోనే ఎన్నడూ లేనంత భారీ కలెక్షన్స్‌తో మరో కొత్త రికార్డు సష్టించింది.2022లో విడుదలైన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ మొదటి రోజు గ్రాస్‌ కలెక్షన్స్‌ 233 కోట్లు కాగా, అల్లు అర్జున్‌ ‘పుష్ప 2’ ఈ రికార్డును సునాయాసంగా దాటేసింది. మొదటి రోజే రూ. 294 కోట్ల గ్రాస్‌ కలెక్షన్స్‌తో సరికొత్త రికార్డు క్రియేట్‌ చేసింది. గత రికార్డులు అన్నింటినీ తిరగరాస్తూ సాలిడ్‌ కంటెంట్‌ ఉన్న సినిమాగా నిలిచింది. నైజంలో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రం మొదటి రోజు రూ.23 కోట్లు కలెక్ట్‌ చేయగా, ఈ చిత్రం రూ.30 కోట్లు కలెక్ట్‌ చేస్తూ నైజాం రికార్డు కూడా తిరగరాసి, ఫస్ట్‌ప్లేస్‌లో నిలిచింది. అలాగే హిందీలో ఎన్నడూ లేని విధంగా టాప్‌ సినిమాగా రికార్డు సష్టించింది. మొదటి రోజు రూ.72 కోట్ల కలెక్షన్స్‌తో హిందీ సినిమా చరిత్రలోనే నూతన రికార్డ్‌ క్రియేట్‌ చేసింది. డే వన్‌ రికార్డులో అల్‌ టైం రికార్డ్‌ను క్రియేట్‌ చేసింది. ‘పుష్ప 2’ బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ మాత్రమే కాదు. తెలుగువారి కీర్తి కూడా పెంచే స్థాయిలో భారీ బ్లాక్‌బస్టర్‌ హిట్‌ కొట్టడం ఆనందంగా ఉందని మేకర్స్‌ తెలిపారు.