డిసెంబర్ 6వ తేదీన విడుదల చేయాల్సిన ‘పుష్ప 2’ చిత్రాన్ని ఒక్క రోజు ముందుగానే అంటే డిసెంబర్ 5వ తేదీన విడుదల చేయ బోతున్నారు. అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కలయికలో రాబోతున్న చిత్రం ‘పుష్ప -2’. ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రేమికులు ఎదురుచూస్తున్న ఈ చిత్రం ఒకరోజు ముందుగానే అంటే డిసెంబరు 5న విడుదల కానుంది. మైత్రీమూవీ మేకర్స్ అసోసియేషన్ విత్ సుకుమార్ రైటింగ్స్‌తో నిర్మాణం జరుపుకుంటున్న ఈ చిత్రానికి నవీన్ యెర్నేని. వై.రవిశంకర్ నిర్మాతలు. ఈ చిత్ర విడుదల తేదీని తెలియ జేయడానికి గురువారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఈ చిత్రాన్ని ఇండియా వైడ్ పంపిణీ చేస్తున్న పంపిణీదారులు కూడా పాల్గొన్నారు.
నిర్మాత నవీన్ యెర్నేని మాట్లాడుతూ, ‘మేము ఇంతకు ముందు చెప్పిన దాని కన్నా ఒక రోజు ముందుగా, అంటే డిసెంబర్ 5 న ప్రేక్షకుల ముందుకు వస్తున్నాం. కచ్చితంగా ఒక పెద్ద సినిమాగా మారింది. రిలీజ్ కూడా ఘనంగా ప్లాన్ చేస్తున్నాం. ఈ సినిమా అందరి అంచనాలకి మించి ఉండబోతుంది’ అని అన్నారు.
‘ఈ సినిమా పెద్ద హిట్ అవుతుంది అని మా అందరికీ నమ్మకం ఉంది. మా తోటి డిస్ట్రిబ్యూటర్లందరికీ అభినందనలు. మా అందరి ముందు పెద్ద గోల్స్ ఉన్నాయి. డిసెంబర్ 5న గ్రాండ్ రిలీజ్ అవుతుంది. వైజాగ్ నుంచి బళ్లారి సాయి, సతీష్, ఈస్ట్ నుంచి రాయుడు, కష్ణ బన్నీ వాస్, ధీరజ్, వెస్ట్ ఎల్వీఆర్, గుంటూరు యువీ వంశీ, నెల్లూరు భాస్కర్ రెడ్డి, సీడెడ్ అభిషేక్ రెడ్డి మా టీమ్. మేమందరం ఈ సినిమాతో పెద్ద హిట్ కొట్టాలని కోరుకుంటూ మీ ఆశీర్వాదం కోరుతున్నాం. సినిమా వర్క్ అంతా బాగా జరుగుతుంది’ అని మరో నిర్మాత రవిశంకర్ చెప్పారు.
మైత్రి డిస్ట్రిబ్యూటర్ శశి మాట్లాడుతూ, ‘నైజంలో మేం ఈ సినిమా విడుదల చేస్తున్నాం. ఈ ఏరియాలో సినిమా పెద్ద నెంబర్‌ని ఎచీవ్ చేస్తుంది’ అని తెలిపారు. తమిళంకి సంబంధించి ఏజీఎస్ డిస్ట్రిబ్యూటర్ మాలి మాట్లాడుతూ, ‘పుష్ప ఒక బ్రాండ్‌గా మారింది. తమిళ్‌లో ఈ సినిమాకి పెద్ద రిలీజ్ ఇచ్చాం. ఈ సినిమాకి డబుల్ డిజిట్ ఓపెనింగ్ ఉంటుంది అని మేము విశ్వసిస్తున్నాం. మేము ఇటీవలే 806 స్క్రీన్స్‌లో విజరు ‘గోట్’ సినిమా విడుదల చేసాం. పుష్ప2ని కూడా అన్ని స్క్రీన్స్‌లో రిలీజ్ చేస్తున్నాం’ అని చెప్పారు.