పుష్ప 2.. రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

Pushpa 2.. release date fixedఅల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘పుష్ప’ ది రైజ్‌.. ఎంతటి సంచలన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. 2021 బిగ్గెస్ట్‌ కమర్షియల్‌ బ్లాక్‌ బస్టర్‌గా నిలిచింది. అంతేకాదు అల్లు అర్జున్‌ కెరీర్‌లోనే అతిపెద్ద విజయంగా నిలవడంతోపాటు.. తనకు జాతీయస్థాయి అవార్డు తెచ్చి పెట్టిన చిత్రంగానూ నిలిచింది. దీంతో దీనికి సీక్వెల్‌గా తెరకెక్కుతోన్న ‘పుష్ప ద రూల్‌’ చిత్రం పై భారీ అంచనాలు పెరిగాయి. ఎప్పుడెప్పుడు ఈ సినిమా విడుదలవుతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు సోమవారం చిత్ర యూనిట్‌ గుడ్‌ న్యూస్‌ అందించింది. వచ్చే ఏడాది స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఆగస్టు 15న ఈ చిత్రాన్ని వరల్డ్‌ వైడ్‌గా విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్‌ జరుగుతోంది. మైత్రి మూవీ మేకర్స్‌ అసోసియేషన్‌ విత్‌ సుకుమార్‌ రైటింగ్స్‌ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్రానికి నవీన్‌ ఏర్నేని, వై రవిశంకర్‌ నిర్మాతలు.