అసెంబ్లీ, మండలిలో పీవీకి పుష్పాంజలి

అసెంబ్లీ, మండలిలో పీవీకి పుష్పాంజలినవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
భారత మాజీ ప్రధాని పి.వి నర్సింహ రావుకు భారత రత్న రావడం పట్ల పలువురు ఎమ్మెల్సీలు హర్షం వ్యక్తం చేశారు. శుక్రవారం హైదరాబాద్‌ లోని శాసనమండలి అవరణలో ఆయన కుమార్తె ఎమ్మెల్సీ వాణి దేవిని శాలువతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. అసెంబ్లీలోని పీవీ చిత్రపటానికి పలువుర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పుష్పాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తదితరులు పాల్గొన్నారు.