వధువుకు పుస్తె, మెట్టెలు అందజేత

నవతెలంగాణ-గంగాధర: గంగాధర మండలం తాడిజెర్రి గ్రామానికి చెందిన నూతన వధువు నవ్యకు కరీంనగర్ పాల డైరీకి పక్షాన పుస్తె, మెట్టెలను గ్రామ డైరీ మేనేజర్ రవి అందించారు. డైరీకి పాలు పోస్తున్న మల్లయ్య-లత దంపతుల కూతురు నవ్య వివాహం ఆదివారం జరిగింది. డైరీకి పాలు పోసే కుటుంబంలో ఆడబిడ్డలకు పెళ్లి డైరీ పక్షాన పుస్తె, మెట్టెలు అందించే పథకాన్ని పాల డైరీ అమలు చేస్తుంది. ఈ స్కీంలో భాగంగానే నవ్యకు పుస్తె, మెట్టెలు అందించారు.