దుబ్బాక మండల పరిధిలోని ఆకారం గ్రామానికి చెందిన బూదయ్య అనే రైతు కరీంనగర్ పాల ఉత్పత్తి దారుల సంస్థలో ఖాతాదారుడు. అయితే బుధవారం ఆయన కుమార్తె ప్రత్యుష వివాహం కాగా కరీంనగర్ డైరీ మేనేేజర్ పడకంటి సాయికుమార్ చేతుల మీదగా పుస్తెమ్మట్టెలు అందజేశారు. అనంతరం నూతన వధూవరులను ఆశీర్వదించారు. కార్యక్రమంలో డైరీ అసిస్టెంట్ మేనేజర్ ముష్కామ్ రాజు గౌడ్ ,సూపర్వైసర్ బోట్ల ప్రవీణ్ , సంస్థ అధ్యక్షులు, డైరెక్టర్లు ఉన్నారు.