
మండలంలోని వీరవెల్లి గ్రామ సర్పంచ్ తంగిలపల్లి కల్పనా శ్రీనివాసచారి సర్పంచ్ ఎన్నికల హామీలో భాగంగా బుధవారం దాసరి పద్మ నాగేష్ దంపతుల ప్రథమ పుత్రిక లక్ష్మీ భవాని సాయికుమార్ వివాహమునకు పుస్తె మెట్టెలు బహుకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామస్తులందరి సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి చేసినట్లు తెలిపారు. సర్పంచ్ కాకముందు ఇచ్చిన హామీలో భాగంగా నేడు గ్రామ శాఖ అందుబాటులో ఉంటూ అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు.