ఊబకాయానికి‌ స్వస్తి పలకండి

– బారియాట్రిక్ శస్త్రచికిత్సతో ఉపశమనం
– అమికస్ స్పెషాలిటీ క్లినిక్ సీనియర్ లాపరోస్కోపిక్, బారియాట్రిక్ సర్జన్ డాక్టర్ వేణు గోపాల్ పరీక్
 
నవతెలంగాణ హైదరాబాద్: ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన అనారోగ్య సమస్యగా ఊబకాయం మారిందని అమికస్ స్పెషాలిటీ క్లినిక్ (హైదరాబాద్) సీనియర్ లాపరోస్కోపిక్, బారియాట్రిక్ సర్జన్ డాక్టర్ వేణు గోపాల్ పరీక్ తెలిపారు. అధిక బరువు (ఒబెసిటీ) అనేది శరీరంలో అధిక కొవ్వు కారణంగా కలిగే పరిస్థితి అన్నారు. ఇది కేవలం దేహ సౌందర్యానికి సంబంధించిన సమస్య మాత్రమే కాదని, గుండె, మధుమేహం, అధిక రక్తపోటు, కొన్ని రకాల కాన్సర్ ప్రమాదాన్ని పెంచనుందని తెలిపారు. ఒబెసిటీకి కారణాలు బహుముఖంగా ఉన్నాయన్నారు. జన్యుపరమైన అంశాలు, సరైన ఆహారం, శారీరక శ్రమ లేకపోవడం కారణాలుగా చెప్పవచ్చన్నారు. మానసిక ఒత్తిడి, భావోద్వేగాల కారణంగా వచ్చే ఆహారపు అలవాట్లు, హార్మోన్ల అసమతుల్యతలు కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు.
ఆహారం, వ్యాయామం, ప్రవర్తనలో మార్పులు కొంతమందికి ప్రభావవంతంగా ఉంటాయన్నారు. తీవ్రమైన స్థూలకాయంతో ఉన్న వారికి ఇవేమీ సరిపోవన్నారు. అప్పుడు బారియాట్రిక్ శస్త్రచికిత్స ఒక పరిష్కారంగా చెప్పవచ్చన్నారు.  బారియాట్రిక్ శస్త్రచికిత్సతో జీర్ణక్రియ వ్యవస్థను మార్చి, ఆహారం తీసుకునే పరిమాణాన్ని తగ్గిస్తారని తెలిపారు. ఇది బరువు తగ్గడానికి అవకాశం కల్పిస్తుందన్నారు. ఈ విధానం వల్ల టైప్ 2 మధుమేహం వంటి స్థూలకాయానికి సంబంధించిన అనారోగ్య సమస్యలను అధిగమించవచ్చని తెలిపారు.
బారియాట్రిక్ శస్త్రచికిత్స ప్రయోజనాల్లో ప్రధానంగా టైప్ 2 మధుమేహంపై దీని ప్రభావం అన్నారు. బరువు తగ్గక ముందే.. శస్త్రచికిత్స తర్వాత కొన్ని రోజులు లేదా వారాల్లోనే మధుమేహం రిమిషన్ జరగడం అనేక అధ్యయనాల్లో తేలిందని తెలిపారు. ఇది ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరచడం, రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించే మెటబాలిక్ మార్పుల కారణంగా జరుగుతుందని పేర్కొన్నారు. ఈ శస్త్రచికిత్స కేవలం బరువు తగ్గించడమే కాకుండా జీవనశైలిని పూర్తిగా మారుస్తుందన్నారు. రోగులు జీవన నాణ్యత, మానసిక ఆరోగ్యంలో మెరుగుదల ఉంటుందన్నారు. రక్తపోటు, నిద్ర సమస్యలు, మోకాళ్ల నొప్పులు వంటి వ్యాధులు తగ్గడంతో దీర్ఘకాలిక ఆరోగ్య ఖర్చులు గణనీయంగా తగ్గుతాయని తెలిపారు. ఇది వ్యక్తులకు చురుకైన, ఆరోగ్యవంతమైన జీవనశైలికి అవకాశం ఇస్తుందన్నారు.
ఈ సందర్భంగా ఒక రోగి అనుభవాన్ని చెప్పాలనుకుంటున్నారు. ఎందుకంటే, నా సలహాతో ఆయన జీవితం మారిందన్నారు. ఇప్పుడు ఎంతో సంతోషంగా జీవనం సాగిస్తున్న ఆయన గురించి.. ‘ఆయన వయస్సు‌ 64 సంవత్సరాలు, అనేక సంవత్సరాలుగా ఊబకాయం, అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు. ఆహార నియమాలు, మందులతో చేసిన అనేక ప్రయత్నాలు సఫలీకృతం కాలేదు. దీంతో బరువు తగ్గలేకపోయారు. నా సలహాతో ఆయన స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఇప్పుడు ఆయన 50 కిలోలు బరువు తగ్గి, అనుబంధ వ్యాధుల నుంచి విముక్తి పొందారు’ అని తెలిపారు. జీవనానికి రెండో అవకాశం వచ్చినందుకు రోగి ఎంతో సంతోష పడ్డారన్నారు.
ఊబకాయం, అనారోగ్య సమస్యలు జీవితాన్ని ప్రభావితం చేస్తుంటే, దీర్ఘకాలిక పరిష్కారాన్ని పరిశీలించడానికి ఇది సరైన సమయం అన్నారు. అర్హత కలిగిన బారియాట్రిక్ శస్త్రచికిత్స నిపుణులను సంప్రదించి శస్త్రచికిత్స విషయంపై చర్చించాలన్నారు. ఊబకాయం నుంచి విముక్తి పొందడం అంటే కేవలం ఎక్కువ కాలం జీవించడమే కాదని, మంచి జీవితం గడపడం కూడా అన్నారు.