బేటీ బచావో బేటీ పడావో లోగోను పెట్టండి

బేటీ బచావో బేటీ పడావో లోగోను పెట్టండి– అన్ని యూనివర్సిటీ, కాలేజీలకు యూజీసీ ఆదేశం
– విద్యాయేతర ఆదేశాలపై విద్యావేత్తల విమర్శలు
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
నరేంద్ర మోడీ ప్రభుత్వ బేటీ బచావో బేటీ పడావో (బీబీబీపీి) లోగోను తమ ప్రాంగణంలో ఇన్‌స్టాల్‌ చేసుకోవాలని, అలాగే తమ వెబ్‌సైట్‌, స్టేషనరీ వస్తువులపై కూడా ఉపయోగించాలని యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) అన్ని విశ్వవిద్యాల యాలు, కళాశాలలను ఆదేశించింది.
ప్రధాని మోడీ కటౌట్లతో సెల్ఫీ పాయింట్లు ఏర్పాటు చేయాలని గతంలో ఉన్నత విద్యా సంస్థలను కోరిన విషయం తెలిసిందే. తాజాగా యూజీసీ అన్ని విశ్వవిద్యాలయాల వైస్‌-ఛాన్సెలర్లు, అన్ని కళాశాలల ప్రిన్సిపాల్స్‌కు బీబీబీపీ లోగోలను ఉపయోగించి బాలికల విలువపై అవగాహన కల్పించాలని లేఖ రాసింది. లింగ వివక్షకు వ్యతిరేకంగా అవగాహన కల్పించేందుకు మహిళ మంత్రిత్వ శాఖ బీబీబీపీ పథకాన్ని అమలు చేస్తోంది.
‘మహిళ, శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆడపిల్లల విలువపై అవగాహన కల్పించాలని ప్రతిపాదించింది. బీబీబీపీ లోగో, ట్యాగ్‌లైన్‌ను కూడా జత చేసింది. వెబ్‌సైట్‌, పోర్టల్‌లు, స్టేషనరీ వస్తువులు, ఈవెంట్‌లు, హెచ్‌ఈఐల ప్రాంగణంలో ఉన్న ప్రముఖ ప్రదేశాల్లో బీబీబీపీ లోగోను ఉపయోగించాలని ఉన్నత విద్యా సంస్థలకు సూచించాం .
ఇది ఆడపిల్లల హక్కులు, మహిళల సాధికారత నిబద్ధతను తెలియజేస్తుంది’ అని యూజీసీ కార్యదర్శి మనీష్‌ జోషి విడుదల చేసిన లేఖలో పేర్కొన్నారు.
”అంతేకాకుండా, నిర్వహించే కార్యకలాపాల వివరాలను ష్ట్ర్‌్‌జూర://బaఎశీ.బవష.aష.ఱఅ లో యూనివర్సిటీ యాక్టివిటీ మానిటరింగ్‌ పోర్టల్‌ (యూఏఎంపీ)లో ఫొటోలు, వీడియోలతో పాటు అప్‌లోడ్‌ చేయవచ్చు” అని లేఖలో పేర్కొన్నారు.
‘ఈ ప్రక్రియలో విద్యా సంస్థలు నష్టపోతున్నాయి. ఎందుకంటే వారి దృష్టి ఈవెంట్లను నిర్వహించడంపై కేంద్రీకృతమై ఉంటుంది. ప్రాధాన్యత బోధన, పరిశోధన నుంచి విద్యాయేతర కార్యకలాపాలకు మారుతుంది’ అని అన్నారు. ఇటువంటి చర్యలతో డబ్బు ఖర్చు చేస్తున్నారని ఆమె చెప్పారు.
యూజీసీ చట్టం ప్రకారం యూనివర్సిటీలు అకడమిక్‌ ప్రమాణాల నిర్వహణను నిర్ధారించడమేనని ఒక సీనియర్‌ విద్యావేత్త చెప్పారు. ‘యూజీసీ దాని ప్రధాన ప్రాధాన్యత నుంచి తప్పుకుంది.
దాని డొమైన్‌కు మించిన పనులను చేస్తోంది. భావజాలం, ఇతర అకడమిక్‌ పరిగణనల ఆధారంగా వైస్‌-ఛాన్సలర్లను నియమిస్తున్న విధానం, ప్రభుత్వ రాజకీయ ప్రచార ఆదేశాలను వారు పాటించడం వంటి వాటి వల్ల యూజీసీ స్వతంత్రతను కోల్పోతుంది’ అని ఆయన అన్నారు. ఇలాంటి విషయాలపై నిర్ణయం తీసుకునేందుకు యూనివర్సిటీలకే వదిలేయాలని అన్నారు.
‘యూజీసీ ఉద్దేశపూర్వకంగానే ఇలా చేస్తోంది. ఇలా విద్యాసంస్థల వ్యవహారాల్లో విద్యాయేతర కార్యకలాపాల్లో జోక్యం చేసుకోకుండా నిరోధించడానికి దీనిని కోర్టులో సవాలు చేయాలి. క్షీణిస్తున్న విద్య నాణ్యతను ఎలా మెరుగుపరచాలో యూజీసీ సూచించాలి’ అని ఆయన అన్నారు. యూజీసీ గత నెలలో యూనివర్సిటీలు, కాలేజీల్లో ప్రధాని కటౌట్‌లతో సెల్ఫీ పాయింట్లు ఏర్పాటు చేయాలని కోరింది. సంస్థలు సూచనలను పాటిస్తున్నాయి.