మినిమం చాలు మిత్రమా…

Minimum is enough my friend...ఒక్కో బంధాన్ని
భుజం నుండి దింపేసుకోవాలి
ఎవరి దుఖాన్ని వారే
మోయడానికి అలవాటు పడాలిగా

ఒంటరి తనాన్ని
దేహం అంతా కప్పుకోవాలి
తడుము దామని వెతికినా
తన వారు దరికి రాని
రోజు వుండ వచ్చు

షాంపూ సాచెట్‌ దండలా వున్న
కాంటాక్ట్‌ లిస్ట్‌ ఖాళీ అయి
వెతికి వెతికి ఎంతో నొక్కినా
అందుబాటులో లేరని ఆన్సర్‌ రావొచ్చు

తేలికగా తేలిపోదాం
దిల్‌ కా తుకడాలను డిలీట్‌ చేయాలి
బాకీలు బంధాలు
మరో జన్మకు పోస్టింగ్‌ చేయలేం

మినిమలిజం నయా ఇజం
అతి తక్కువ అనుబంధాలతో
పొద్దు మాపును తోస్తూ
అంతిమ ప్రయాణానికి సిద్ధం అవ్వాలి

స్మాల్‌ పెగ్‌ చాలు మిత్రమా
నిద్రలో నిండా మునిగి పోతే
కొత్త కలలు మొలకెత్తు తాయి
మనసుకు మొహించడం
తగదు ఇంకా…

– దాసరి మోహన్‌, 9985309080