బహుళ ధ్రువ ప్రపంచంలో బ్రిక్స్‌ కీలక పాత్ర :పుతిన్‌

మాస్కో: బహుళ ధ్రువ ప్రపంచంలో కీలకమైన నియంత్రణ సంస్థగా ‘బ్రిక్స్‌’ నిలుస్తుందని రష్యా అధ్యక్షుడు వ్లదిమిర్‌ పుతిన్‌ చెప్పారు. భారత్‌, రష్యా, చైనా, బ్రెజిల్‌, సౌతాఫ్రికాతో కూడిన ఈ కూటమికి రష్యా ప్రస్తుతం అధ్యక్షత వహిస్తున్నది. రష్యన్‌ విదేశాంగ మంత్రిత్వశాఖ శుక్రవారం నిర్వహించిన సమావేశంలో పుతిన్‌ మాట్లాడుతూ బ్రిక్స్‌ ఇప్పుడు ప్రపంచ దృష్టిని విశేషంగా ఆకర్షిస్తోందని అన్నారు. బ్రిక్స్‌లో మరి కొన్ని దేశాలను చేర్చుకోవడం ద్వారా దీనిని మరింత విస్తరిస్తామన్నారు. కొత్త రాజకీయ, ఆర్థిక వాస్తవికతలకు అనుగుణంగా బహుళ ధ్రువ లేదా బహుళ పాక్షిక ప్రపంచ క్రమం రూపుదిద్దుకుంటున్న క్రమంలో బ్రిక్స్‌కు చాలా కీలక పాత్ర ఉందని అన్నారు.