– తాడిచెర్ల పిఏసీఎస్ చైర్మన్ చేప్యాల రామారావు
నవతెలంగాణ- మల్హర్ రావు: మంథని ఎమ్మెల్యేగా బీఆర్‌ఎస్ మంథని ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మదును గెలిపిస్తేనే మంథని నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని తాడిచెర్ల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘము చైర్మన్ చేప్యాల రామారావు అన్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బాగంగా మండలంలోని మల్లారం, డబ్బగట్టు గ్రామాల్లో ఆదివారం ఇంటింటా తిరుగుతూ బిఆర్ఎస్ కార్యకర్తలతో బ్యాలెట్ నమూనాతో ప్రజలకు కారు గుర్తుపై వివరిస్తూ విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. బీఆర్‌ఎస్ ఎన్నికల మేనీఫెస్టోలో పొందుపర్చిన పథకాలు ప్రతి కుటుంబానికి మేలు చేసేలా ఉన్నాయని, ముఖ్యంగా గృహిణీలకు ఉపయోగపడుతాయన్నారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ అధికారంలోకి రాగానే ప్రతి గృహిణికి ఇంటి అవసరాలకు మూడు వేలు, రూ.400లకే గ్యాస్‌సిలిండర్‌తో పాటు కేసీఆర్ భీమా పథకాన్ని అమలు చేస్తున్నట్లుగా వివరించారు. రాబోయే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి పుట్ట మధూకర్ ఆదరించి ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.