నవతెలంగాణ – ముత్తారం
ముత్తారం మండలం ఓడేడు – జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం గర్మిళ్లపల్లి గ్రామాల మధ్య మానేరుపై నిర్మించిన వంతెనను శుక్రవారం క్వాలిటీ కంట్రోల్ అధికారులు పరిశీలించారు. క్వాలిటీ కంట్రోల్ అధికారులు నర్సింప రావు, శామ్యూల్ కూలిపోయిన బ్రిడ్జీ గర్డర్లను పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. క్రాస్ గర్డర నిర్మించకపోవడంతో గర్డర్లు కూలిపోయాయని అధికారులు వారికి వివరించారు. పూర్తి స్థాయిలో నాణ్యత పరిశీలించి, నాణ్యత లేని వాటిని తొలగించి, కొత్త వాటిని నిర్మిస్తామని తెలిపారు. వంతెన నిర్మాణ పనులు త్వరలోనే కొత్త ఏజెన్సీతో నిర్మిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఈ లక్ష్మణ్; ఈఈ బాపు సింగ్, డిఈ జాఫర్, జెఈ హరీష్ ఉన్నారు.