– జమ్మికుంటలో సీసీఐ కొనుగోలు ప్రారంభం
నవతెలంగాణ – జమ్మికుంట
రైతులు అరుగాలం శ్రమించి పండించిన పత్తిని ఆరబెట్టి సిసిఐ నిబంధనల ప్రకారం మార్కెట్ లో విక్రయించి ,ప్రభుత్వ మద్దతు ధర పొందాలని మార్కెటింగ్ శాఖ జాయింట్ డైరెక్టర్ శ్రీనివాస్ రైతులకు సూచించారు. బుధవారం జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ యార్డులో సిసిఐ ఆధ్వర్యంలో పత్తి కొనుగోళ్ళు ప్రారంభించారు.
ఈ సందర్బంగా శ్రీనివాస్ మాట్లాడారు. సిసిఐ సంస్థకు పత్తిని విక్రయించాలనుకునే రైతులు తమ ఇంటి వద్దనే పత్తిలో నీళ్ళు చల్లకుండా, పత్తిని శుభ్రపరిచి, తేమ శాతం 8 నుండి 12 శాతం ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. నిబంధనల ప్రకారం ఉన్న పత్తికి క్వింటాల్ ధర 7,521 రూపాయల నుండి 7, 221. 16 మద్దతు ధర ఉంటుందన్నారు. పత్తిని సిసిఐకి విక్రయించడానికి తీసుకువచ్చే రైతులు తమ వెంట రైతుకు సంబందించిన ఆధార్ కార్డు జిరాక్స్, పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్స్, ఆధార్ తో అనుసంధానం చేసుకున్న పాస్ పుస్తకం జిరాక్స్, ఆధార్ తో అనుసంధానం చేసుకున్న మీ ఫోన్ కు వోటిపి వచ్చే సెల్ తప్పకుండ వెంట ఉండాలని సూచించారు.ఈ కార్యక్రమంలో డిడియం పద్మావతి, జిల్లా మార్కెటింగ్ అధికారి ప్రకాష్, హుజురాబాద్ ఆర్ డి ఓ రమేష్ బాబు, సిసిఐ సెంటర్ ఇంచార్జి చంద్రశేఖర్, మార్కెట్ కార్యదర్శి ఆర్ మల్లేశం, ద్వితీయ శ్రేణి కార్యదర్శి ఎస్ రాజు, అడితిదారులు, ఖరీదు దారులు, రైతులు, హమాలీ దాడ్ వాయిలు, కార్మికులు ఉన్నారు.