
జమ్మికుంట పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత బాలుర పాఠశాల లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు మున్సిపల్ పరిధిలోని కొత్తపెళ్లి గ్రామంలో మంగళవారం బడిబాట కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి తిరిగి డ్రాపౌట్స్ ను గుర్తించి, ప్రైవేటు పాఠశాలలో చదువుతున్న విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి సౌకర్యాలు, ఉచి తాల గురించి తల్లిదండ్రులకు వివరించి విద్యార్థుల నూతన అడ్మిషన్లను నమోదు చేసుకుంటున్నారు. తమ పాఠశాలలో 2023- 24 విద్యా సంవత్సరంలో 260 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నట్లు తెలిపారు. తమ పాఠశాలలో డిస్క్ బెంచ్ లు ఉన్నాయని, ఇంగ్లీష్ మాధ్యమంలో విద్యా బోధన ఉంటుందని కంప్యూటర్ విద్య ఉందని, డిజిటల్ విద్య బోధన చేయబడుతుందని తెలిపారు. తమ పాఠశాల కార్పొరేట్ భవనానికి దీటుగా ఉందని, మంచి ఆట స్థలం ఉందని, మధ్యాహ్నము ఉచిత భోజనము , స్కూల్ డ్రెస్సులు, పాఠ్యపుస్తకాలు, షూస్, నోటు బుక్కులు ప్రభుత్వమే ఉచితంగా అందజేస్తుందని తెలిపారు. తమ పాఠశాలలో ఎన్ సి సి, ఒకేషనల్ విద్య, అధునాతన ల్యాబ్స్ కంప్యూటర్ లో విద్యా బోధన లాంటి వసతులు కల్పిస్తున్నామని తెలిపారు. కాబట్టి తల్లిదండ్రులు ఆలోచన చేసి ప్రైవేటు నుండి ప్రభుత్వ పాఠశాలలో తమ పిల్లల్ని చేర్పించి, నాణ్యమైన విద్యను పొందుతూ ఆర్థిక భారాన్ని తగ్గించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సదానందం, జ్యోతి, సంపత్, శ్రీనివాస్ రావు, ఏసుమని, వెంకట్ రెడ్డి, స్వామి, శారద తదితరులు పాల్గొన్నారు.