ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన విద్య 

Quality education in government schools– మండల విద్యాశాఖాధికారి బుధారపు శ్రీనివాస్ 
నవతెలంగాణ – పెద్దవంగర
ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థులకు కార్పొరేట్ స్థాయిలో విద్యార్థులు మండల విద్యాశాఖ అధికారి బుధారపు శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని విద్యా వనరుల కేంద్రంలో రెండో విడత పాఠ్య పుస్తకాలను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు ఉచిత విద్య, మధ్యాహ్న భోజన వసతి, నోటు పుస్తకాల పంపిణీ, దుస్తుల పంపిణీ తో పాటుగా ప్రభుత్వం సకల సౌకర్యాలు కల్పిస్తుందన్నారు. సర్కారు పాఠశాలల బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో సీఆర్పీలు వేముల సంతోష్, నిరంజన్ పాల్గొన్నారు.