
నవతెలంగాణ – పెద్దవంగర
ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థులకు గుణాత్మక విద్య అందుతుందని మండల విద్యాశాఖ అధికారి బుధారపు శ్రీనివాస్ అన్నారు. మండల కేంద్రంలోని మండల విద్యా వనరుల కేంద్రంలో శుక్రవారం టీపీటీఎఫ్ 2025 క్యాలెండర్ ను ఆ సంఘం మండల అధ్యక్షుడు చిక్కాల సతీష్ తో కలిసి ఆవిష్కరించారు. అనంతరం ఎంఈవో ఉపాధ్యాయులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీపీటీఎఫ్ నిబద్ధత కలిగిన సంఘం అని పేర్కొన్నారు. విద్యారంగ సమస్యల పరిష్కారానికి, పాఠశాల పరిరక్షణకు టీపీటీఎఫ్ నిరంతరం పోరాడుతుందన్నారు. నూతన సంవత్సరంలో ఉపాధ్యాయులు రెట్టింపు ఉత్సాహంతో, అంకితభావంతో విధులు నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయ సంఘాల రాష్ట్ర, జిల్లా, మండల నాయకులు పాల్గొన్నారు.