– హుస్నాబాద్ ఎంపీపీ మానస
నవతెలంగాణ-హుస్నాబాద్ రూరల్
ప్రభుత్వ బడిలో ధాన్యమైన విద్య అందుతుందని హుస్నాబాద్ ఎంపీపీ లకావత్ మానస సుభాష్ అన్నారు. మంగళవారం మండలంలోని మిర్జాపూర్ ఉన్నత పాఠశాలలో తరగతి గదులలో డిజిటల్ బోర్డు, విద్యార్థులకు పార్టీ పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ లు తరాల లత, వంగరామయ్య పల్లి సర్పంచ్ వంగ విజయ, వెంకటరామిరెడ్డి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.