
ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్యఅందిస్తున్నారని ఎంపిడీఓ ఉమాదేవి అన్నారు. బుధవారం మండలం లోని పోతునూరు గ్రామం లో ప్రాథమికోన్నత పాఠశాలను ఎంపీడీఓ ఉమాదేవి ఆకస్మికంగా తనిఖీ చేశారు. తరగతి గదిలో విద్యార్థులకు అందుచున్న విద్య ప్రమాణాలను విద్యార్థుల ద్వారా అడిగి తెలుసుకున్నారు, వివిధ తరగతుల విద్యార్థులను వారి వారి తరగతి సమర్థ్యల ఆధారంగా పిల్లలను ప్రశ్నించి వారి సమర్థ్యలు తెలుసుకున్నారు. పాఠశాల పరిసరాలు, హాజరు రిజిస్టర్లు, స్టాక్ రిజిస్టర్లు సెలవుల రిజిస్టర్లు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.విద్యార్థులతో కలివిడిగా మాట్లాడి అనేక విషయాలపై ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు. విద్యార్థిని విద్యార్థులకు ప్రభుత్వం నాణ్యమైన పౌష్టికాహారం,మధ్యాహ్న భోజనం, రెండు జతల ఏకరూప దుస్తులు,ప్రీమెట్రిక్ స్కాలర్షిప్ అందజేస్తుందని కావున అందరూ సద్వినియోగం చేసుకొని ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసే దిశగా కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వెంకట్రామ్ నాయక్, ఏపీఓ వెంకటేశ్వర్లు, కార్యదర్శి లక్ష్మి, రామ్మూర్తి, మెహజాబి, లావణ్య అంజుమ్, ధర్మారెడ్డి, ఫీల్డ్ అసిస్టెంట్ ఎల్లయ్య, మదనజీ తదితరులు పాల్గొన్నారు.