ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య: ఎంపీపీ..

నవతెలంగాణ – మల్హర్ రావు
ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య బోధించడం జరుగుతుందని మండల ఎంపిపి చింతలపల్లి మలహల్ రావు అన్నారు.సర్కారు బడుల్లో విద్యార్థుల సంఖ్యను పెంచడానికి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బడిబాట కార్యక్రమంలో భాగంగా ఉపాధ్యాయులు బుధవారం బడిబాట కార్యక్రమాన్నీ నిర్వహించి పాఠశాలలు పున.ప్రారబించారు.ఈ సందర్భంగా మండల కేంద్రమైన తాడిచెర్ల జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలతోపాటు అన్ని పాఠశాలల్లో పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్,ఏకరూప దుస్తులు విద్యార్థులకు పంపిణీ చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్యదితులుగా ఎంపీపీ, జెడ్పీటీసీ అయిత కోమల హాజరై విద్యార్థులకు బుక్స్,యూనిపామ్స్ అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడారు ప్రభుత్వ పాఠశాలల్లో పాఠ్య పుస్తకాలు,నోట్ బుక్స్,యూనిపామ్స్, మధ్యాహ్న భోజనం ఉచితంగా అందించడం జరుగుతుందన్నారు.బడిడు పిల్లలను చేర్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తాడిచెర్ల హెడ్ మాస్టర్ మల్కా భాస్కర్ రావు,ఆయా గ్రామాల్లోని పాఠశాలల ఉపాధ్యాయులు,విద్యార్థులు, తల్లిదండ్రులు  పాల్గొన్నారు.