ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య..

Quality education in government schools.– పెద్దపల్లి జిల్లా విద్యాధికారి మాధవి
నవతెలంగాణ – ధర్మారం                    
ప్రభుత్వ పాఠశాలలోనే విద్యార్థులు నాణ్యమైన విద్య అభ్యసించి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని  పెద్దపల్లి జిల్లా విద్యాధికారి మాధవి అన్నారు మండలంలోని రచ్చపల్లి ఉన్నత పాఠశాలలో నిర్వహించన పేరెంట్స్, టీచర్ సమావేశానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన జిల్లా విద్యాశాఖాధికారి మాధవి మాట్లాడుతూ  ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతుందని ప్రతీ ఒక్కరూ తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి వారి ఉజ్వల భవిష్యత్తుకు పాటుపడాలని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో అర్హత అనుభవం గల ఉపాధ్యాయులున్నారని ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందని అన్నారు.రచ్చపల్లి పాఠశాలలో నిర్వహిస్తున్న వినూత్న పద్ధతులతో విద్యార్థులు అన్నింటిలో తమ ప్రతిభ సామర్ధ్యాలు సాధిస్తున్నారని ఇక్కడ పాఠశాల గోడలపై చిత్రించిన టి ఎల్ ఎం చక్కని ఫలితాలు ఇస్తుందని అన్నారు .ఈ సందర్బంగా పేరెంట్ టీచర్ మీటింగ్ కు వచ్చిన తల్లిదండ్రులకు ముగ్గుల పోటీలు నిర్వహించి బహుమతులు పంపిణీ చేశారు అలాగే ధారాలంగా చదువుతున్న విద్యార్థులకు జిల్లా విద్యాధికారి చేతులమీదుగా ఓ ఆర్ ఎఫ్ బ్యాడ్జిలను అందించారు  ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు సముద్రాల వంశీ మోహనా చార్యులు, ఉపాధ్యాయులు సంపత్, లక్ష్మణ్, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్ పర్సన్ ప్రమీల అధిక సంఖ్యలో విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.