నవతెలంగాణ – గంగాధర : ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య లభిస్తుందని పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు గోనె శ్రీనివాస్ అన్నారు. గంగాధర మండలంలోని చర్లపల్లి (ఆర్) గ్రామంలో గురువారం మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో బడిబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గోనె శ్రీనివాస్ మాట్లాడుతూ గ్రామంలోని బడి ఈడు పిల్లలు నాణ్యమైన విద్యను అందించే సర్కారు బడికి తమ పిల్లలను పంపాలని ఇంటింటికి తిరుగుతూ బడిబాట ద్వారా చిన్నారుల తల్లిదండ్రులను కోరారు. కార్యక్రమాన్ని నిర్వహించారు. చెర్లపల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో ఆంగ్ల మాధ్యమంలో చక్కని నాణ్యమైన విద్య లభిస్తుందని, ఉచిత పాఠ్య పుస్తకాలు, మధ్యాహ్న భోజనం, ఉచిత స్కూల్ యూనిఫామ్స్ ను అందించే ప్రభుత్వ పాఠశాలకు పిల్లలను పంపించాలని విజ్ఞప్తి చేశారు. నాణ్యమైన విద్యను అందించే నిష్ణాతులైన ఉపాధ్యాయులు, మంచి వసతుల మధ్య విద్యా బోధన చేయడం జరుగుతుందని అన్నారు. అధిక ఫీజులు వసూలు చేసే ప్రైయివేట్ పాఠశాలల యాజమాన్యాలు చేసే జిమ్మిక్కులను నమ్మి తల్లిదండ్రులు మెాసపోవద్దని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయురాలు జే. కవిత , గ్రామ పెద్దలు, పాఠశాల కమిటీ సభ్యులు పెద్ది రాజు, ముత్తయ్య, స్వప్న, అరుణ, లచ్చయ్య, కనుకయ్య, అంజయ్య తదితరులు పాల్గొన్నారు.