
విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని జిల్లా విద్యాధికారి కే.అశోక్ అన్నారు. తిరుమలగిరి మండలం (అనంతారం ) ఆదర్శ పాఠశాలను శనివారం జిల్లా విద్యాధికారి కే.అశోక్ ఆకస్మికంగా సందర్శించారు. పాఠశాలలో విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలను మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. వసతి గృహాన్ని తనిఖీ చేసి వసతులపై ఆరా తీశారు. పాఠశాలలో రికార్డుల పరిశీలనతో పాటు, గ్రంథాలయాన్ని మరియు తరగతి గదులు పరిశీలిస్తూ విద్యార్థులను ప్రశ్నలు అడిగి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం మాట్లాడుతూ.. విద్యార్థులకు గుణాత్మకమైన విద్యను అందించడంతోపాటు, మాధ్యమిక తరగతులకు బోధించే ఉపాధ్యాయులకు తరగతి వారి అభ్యసనం పై దృష్టి సారించాలని సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి శాంతయ్య, ఆదర్శ పాఠశాల ప్రిన్సిపల్ డాక్టర్ సంజీవ్ కుమార్, జడ్.పి.హెచ్.ఎస్ ప్రిన్సిపల్ దామెర శ్రీనివాస్, మరియు ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.