విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలి

Quality education should be provided to the studentsనవతెలంగాణ – ముధోల్
విద్యార్థులకు ఉపాధ్యాయులు నాణ్యమైన విద్య అందించాలని మండల విద్యాధికారి రమణ రెడ్డి అన్నారు. నియోజకవర్గ కేంద్రమైన  ముధోల్ మండల అభివృద్ధి కార్యాలయంలో గల సమావేశ మందిరంలో సోమవారం మండలంలోని ప్రాథమిక ,ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాల ప్రదానోపాధ్యాయులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు .ఎంఈఓ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొట్టమొదటిసారిగా ప్రధానోపాధ్యాయుల సమావేశాన్ని నిర్వహించడం జరిగిందని పేర్కొన్నారు. విద్యార్థులు చదువుతోపాటు ఆటపాటలలోసైతం ముందుండేలా చూడాలని పేర్కొన్నారు. అదేవిధంగా యుడైస్ అలాగే అపార్ ను అప్డేట్ చేయించాలని సూచించారు.  విద్యార్థుల అభ్యాసన ప్రక్రియను వెలికి తీసిపిల్లలు విద్య పట్ల ఆకర్షితులు అయ్యే విదంగా కృషి చేయాలన్నారు.ఈడీఎన్ యాప్ లో మార్కులను  క్రోడికరించాలని సూచించారు.గ్రంథాలయ పిరియడ్ ను ప్రతి పాఠశాల లో ఉంచి ప్రభుత్వం అందించిన వివిదపుస్తకాలను చదివించాలన్నారు.డిసెంబర్4 న కేంద్ర ప్రభుత్వం నిర్వహించే ఎన్ఎఎఎస్ పరీక్ష 3,6,9 తరగతుల విద్యార్థులకు సన్నద్దాం చేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు నరసింహ చారి,అమీర్ కుసురు, మోహినోద్దీన్,వివిధ పాఠశాల ల ఉపాధ్యాయులు తదితరులు. పాల్గొన్నారు.