నవతెలంగాణ – కంటేశ్వర్
ప్రభుత్వ విద్యా సంస్థల్లో నాణ్యమైన భోజనాన్ని అందించాలని ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం ఎస్ఎఫ్ఐ నిజామాబాద్ నగర కమిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వ విద్యా సంస్థల్లో అందించే భోజనంలో నాణ్యతను తనిఖీ చేయాలని నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్ మకరంద్ ఐఏఎస్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా నగర కార్యదర్శి పోషమైన మహేష్ మాట్లాడుతూ.. నిజామాబాద్ నగరంలో గల ప్రభుత్వ పాఠశాలలో కళాశాల హాస్టల్ లో అందించే భోజనంలో సరైన నాణ్యతను పాటించకపోవడం వలన అనేక మంది విద్యార్థులు తరచూ ఆరోగ్య సమస్యలతో సతమతమవుతూ, కొన్ని సందర్భాల్లో సమస్య తీవ్రత వలన ఆసుపత్రి పాలైన సందర్భాలు కూడా ఉన్నాయని అయితే ఈ సమస్యలపై సంబంధిత శాఖ అధికారులకు తెలియజేసిన ఫలితం మాత్రం శూన్యంగా ఉందని అన్నారు. అదేవిధంగా సరైన ఆహారాన్ని తీసుకున్నప్పుడే ఒక విద్యార్థి ఆరోగ్యం బాగుండి ఏకాగ్రతతో చదివి ఉన్నత స్థానాలు చేరుకోగలరు. కాబట్టి మున్సిపల్ కమిషనర్ మకరంద్ స్పందించి, ప్రభుత్వ విద్యా సంస్థల్లో పెట్టే భోజనంలో ఎంత నాణ్యత ఉందో తనిఖీ చేయాలని ఈ సందర్భంగా కోరారు. సానుకూలంగా స్పందించిన కమిషనర్ తనిఖీలు నిర్వహించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలియజేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో నగర ఉపాధ్యక్షులు వేణు, గణేష్ నగర నాయకులు సాయి తదితరులు పాల్గొన్నారు.