మండలంలోని నంది మేడారం బాలికల సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయంలో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని మండల ప్రత్యేక అధికారి, పెద్దపల్లి జిల్లా పంచాయతీ అధికారి వీర బుచ్చయ్య అన్నారు. మండలం లోని సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ఫారముల డేటా ఎంట్రీ కేంద్రాలను శుక్రవారం రోజు సందర్శించి ఎంట్రీలో తగు సూచనలు పాటించాలని సూచించారు. అనంతరం మండలంలోని నంది మేడారం సంఘీక సంక్షేమ గురుకుల విద్యాలయం ఆకస్మికంగా సందర్శించి డైనింగ్ హాల్, వంట సామాగ్రి నిల్వలను తనిఖీ చేసి, విద్యార్థులతో బోజనాల నాణ్యతను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి అయినాల ప్రవీణ్ కుమార్, మండల తహసిల్దార్ మహ్మద్ అరీఫుద్దిన్, మండల పంచాయతీ అధికారి కె . రమేష్ ,మండ పరిషత్ కార్యాలయ పర్యవేక్షకులు సిహెచ్ శ్రీనివాస్ గురుకుల విద్యాలయం ప్రిన్సిపాల్ వై లక్ష్మి, పంచాయతీ కార్యదర్శి ప్రత్యూష , పాఠశాల సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.