
విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని రాజంపేట మండల ఎంఈఓ పూర్ణచందర్ తెలిపారు. మంగళవారం మండలంలోని తలమడ్ల గ్రామంలో ఉన్న ఎంపీపీఎస్ ప్రభుత్వ పాఠశాలను తనిఖీ చేశారు. గ్రామ సమీపంలో ఉన్న పౌల్ట్రీ ఫామ్ లో 26 మంది బడి బయట పిల్లలను గుర్తించి పాఠశాలలో చేర్పించారు. అనంతరం మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేసి విద్యార్థులకు రుచికరమైన భోజనాన్ని అందించాలని ఏజెన్సీ నిర్వాహకులకు సూచించారు. విద్యార్థుల హాజరు పట్టిక, తరగతి గదులు, విద్యాబోధన పరిశీలించి విద్యార్థులతో ఉపాధ్యాయుల విద్యా బోధన గురించి చర్చించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు రమేష్, గంగ మోహన్, ఉపాధ్యాయ బృందం, సి ఆర్ పి సాయి రెడ్డి, లింగం, తదితరులు పాల్గొన్నారు.